NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

10 మంది మంత్రులు.. 20 మంది ఎమ్మెల్యేల‌కు క‌రోన !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మ‌హారాష్ట్రలో క‌రోన వైర‌స్ మరోసారి విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడ చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతున్నాయి. మ‌హారాష్ట్ర అసెంబ్లీలో చాలా మంది క‌రోన బారిన పడ్డారు. వీరిలో చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌యిన 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు క‌రోన బారిన‌ప‌డ్డ‌ట్టు డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ వెల్ల‌డించారు. కేసుల పెరుగుద‌ల ఇదే విధంగా కొన‌సాగితే క‌ఠిన ఆంక్ష‌లు త‌ప్ప‌వ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఆస్ప‌త్రుల్లో చేరే వారి సంఖ్య కూడ పెరిగింద‌ని, ఇలాగే పరిస్థితి కొనసాగితే క‌ఠిన ఆంక్ష‌లు త‌ప్ప‌వ‌ని చెప్పారు.

                                     

About Author