PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మార్కెట్​ యార్డు అభివృద్ధికి…13.50 కోట్లతో ప్రతిపాదన

1 min read

పాలకమండలి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం

యార్డు చైర్మన్​ కొట్టాముల రోఖియాబీ

పల్లెవెలుగు,కర్నూలు: రైతుల సంక్షేమార్థం రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తోందని, అంతేకాక రాష్ట్ర బడ్జెట్​లో ప్రత్యేక నిధుల కేటాయింపులు జరిగాయని కర్నూలు మార్కెట్​ యార్డు చైర్మన్​ కొట్టాముల రోఖియాబీ అన్నారు. సోమవారం మార్కెట్​ యార్డులో కమిటీ పాలక వర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యార్డు అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ…. ప్రతిపాదనలను ఏకగ్రీవంగా తీర్మానించారు. అందులో భాగంగా మార్కెట్​ యార్డులో రైతుల కోసం అదనంగా వాటర్​ సరఫరా కోసం రూ. 10 లక్షలు, అడ్మినిస్టేటివ్​ బిల్డింగ్​, టెండరు హాల్​, రైతు విశ్రాంతి భవన నిర్మాణం కోసం రూ.30 లక్షలు, షాపింగ్​ మాల్​ నిర్మాణానికి రూ.  కోటి 20లక్షలు,  పాత షాపులు(95) మరమ్మతుల కోసం రూ.35 లక్షలు, గోదాము మరమ్మతు కోసం రూ10 లక్షలు, న్యూ మార్కెట్​ యార్డులోని పాత షాపుల మరమ్మతుకు రూ. 15 లక్షలు, గెల్వలుమ్​ రూఫ్​ షెడ్​ తొలగించడానికి రూ.6 కోట్లు,  యార్డులో కవర్డ్​ షెడ్డు మరమ్మతుకు రూ.20లక్షలు, రైతు విశ్రాంతి భవనం కుడివైపున ఉన్న 15 షాపుల మరమ్మతుకు రూ.5 కోట్లు,  మహిళలకు మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 10 లక్షలు మొత్తం రూ.13 కోట్ల 50లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు.  ఈ సందర్భంగా మార్కెట్​ యార్డు చైర్మన్​ రోఖియాబీ మాట్లాడుతూ యార్డు అభివృద్ధికి రూ.13.50 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపుతున్నట్లు స్పష్టం చేశారు.  మిరప, వేరుశనగ, కంది తదితర పంటలు విక్రయించేందుకు వచ్చే రైతులకు అన్ని వసతులు కల్పిస్తామని పాలక మండలి సభ్యులు పేర్కొన్నారు.సమావేశంలో మార్కెట్​ యార్డు సెక్రటరి శ్రీకాంత్​ రెడ్డి, యార్డు వైస్​ చైర్మన్​ రాఘవేంద రెడ్డి,డైరెక్టర్​ షేక్​ మహబూబ్​బాష, తదితరులు పాల్గొన్నారు.

About Author