నెహ్రూనగర్ జలఘోష కు 15 ఏళ్ళు..
1 min read– మూర్వకొండ పుట్టి ప్రమాదంలో 61మంది ప్రయాణికులు మృతి..
– మృతుల స్మారక స్థూపానికి మోక్షం ఎప్పుడో..
– కృష్ణా నదిపై వంతెన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పగిడ్యాల మండలం పాత మూర్వకొండ సమీపంలో జరిగిన పుట్టి ప్రమాదానికి సరిగ్గా 15 ఏళ్ళు. 2007జనవరి18వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి తెలంగాణలోని సింగోటము జాతరకు నాటు పడవపై భక్తులు బయలుదేరారు.మరికొద్ది క్షణాలలో తీరం చేరుకుంటారు. ఏటి నడి మధ్యలోకి వచ్చేసరికి నాటుపడవ బోల్తాపడింది.అందులో ప్రయాణిస్తున్న 61మంది భక్తులు జలసమాధి అయ్యారు.ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి తోడ్పాటునందించింది. ప్రమాదం జరిగిన రెండు రోజుల వరకు శవాలు బయటికీ రాకపోవడంతో కుళ్ళిపోయాయి.దీనితో అక్కడే కొంత మంది మృతదేహాలను ఖననం చేశారు.అప్పట్లో ప్రభుత్వం ఈ విషాద ఘటనను గుర్తించుకొనేందుకు స్మారక స్తూపం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.కానీ ఇంతవరకు వీటి గురించి ఊసే ఎత్తడం లేదు .ఇంత పెద్ద ప్రమాదం జరిగినా నేటికి సింగోటం జాతరకు పడవలపైనే భక్తులు వెళుతుంటారు .ప్రమాదమని తెలిసిన తప్పని ప్రయాణం చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో వెలసిన సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతరకు 2007 జనవరి 18 న బయలుదేరిన భక్తులు పుట్టి ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో61 మంది భక్తులు కృష్ణానదిలో మునిగిపోయారు.ఈ విషాద సంఘటన అప్పట్లో ఉమ్మడి రాష్ట్రాని కుదిపేసింది.పుట్టి ప్రమాదం జరిగిన రెండు రోజుల కు ప్రయాణికుల మృతదేహాలు బయట పడ్డాయి.సంఘటన స్థలాని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రతిపక్ష హోదాలో చంద్రబాబునాయుడు లు పరిశీలించి మృతుల కుటుంబాలను ఓదార్చారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించారు.ఈ ప్రమాదంలో నందికొట్కూరు, కొణిదెల,బిజినేముల, భాస్కరపురం,నెహ్రూనాగర్,సంకిరేణిపల్లి, గ్రామాలకు చెందిన ప్రయాణికులు ప్రమాదానికి గురయ్యారు. మృతదేహాలను కొన్నింటిని సమీపంలోని మూర్వకొండ బురుజుల వద్ద సామూహిక దహన సంస్కారాలను అధికారులు నిర్వహించారు. కృష్ణానదిపై పుట్టి ప్రయాణం ప్రమాదమని తెలిసినా కూడా నేటికి ఇరు రాష్ట్రాల ప్రజలు పడవలపై ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇక్కడి ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో బందువర్గం ఉండడం ఇందుకు కారణం. సోమశిల వద్ద కృష్ణానది పై వంతెన నిర్మాణం చేపడుతామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. రూ.120 కోట్లతో వంతెన నిర్మాణం చేపడుతామని చెప్పినా అమలుకు నోచుకోలేదు.అలాగే మృతుల జ్ఞాపకార్థం పుట్టి ప్రమాదం సంఘటనను గుర్తించుకొనేల స్థలంలో భారీ స్తూపం నిర్మిస్తామని ప్రభుత్వం స్థలం కోసం సర్వేలు కూడా చేయడం జరిగింది.అయితే నేటికి ఆచరణకు సాధ్యం కాలేదు.అధికారులు నివేదికలు సిద్దం చేసిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. సంఘటన జరిగి 15 ఏళ్ళుఅవుతున్న ప్రభుత్వ హామీలు హామీలుగానే మిగిలిపోయావని ప్రజలు ఆరోపిస్తున్నారు.కృష్ణనదిపై వంతెన నిర్మిస్తే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందని,150కిలోమీటర్ల దూరం కూడా తగ్గుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత వంతెన నిర్మాణం మరుగున పడిపోతుందేమోనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తువచ్చారు.అయితే ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం వంతెన నిర్మాణము కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయడం రూ.1800 కోట్లతో సిద్దేశ్వరం సోమశిల మధ్య కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణ పనులకు నిధులు విడుదల చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రతి ఏడాది జనవరి లో జరిగే సింగోటం జాతరకు నెహ్రూనగర్ సమీపంలోని చెల్లపాడు,మంచాలకట్ట ఘాటుకు ఇంజన్ బోట్లు నడుస్తుంటాయి.వీటిద్వారా జాతరకు 2నుంచి 3వేల మంది భక్తులు ప్రయాణం సాగిస్తుండేవారు.ప్రస్తుతం అధికారులు బోటు ప్రయాణం నిషేధించారు.గతంలోఅధికారులు భక్తుల వివరాలను నమోదు చేసుకొని అనుమాతించేవారు .ఈ ఏడాది ప్రభుత్వం బోటు ప్రయాణానికి అనుమతించలేదు.