‘సోలార్’ సమస్యల పరిష్కారం కోసం ‘1912’
1 min read

ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి
తిరుపతి, న్యూస్ నేడు : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని సోలార్ విద్యుత్ వినియోగదారులు సమస్యల పరిష్కారం కోసం టోల్-ఫ్రీ నంబరు: 1912ను సంప్రదించవచ్చని ఆ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సోలార్ విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు కాల్ సెంటర్ కి కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. కాల్ సెంటర్లో సోలార్ సంబంధిత ఫిర్యాదులను కూడా నమోదు చేసే సౌకర్యాన్ని నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. వినియోగదారులు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవిఆర్ఎస్) ద్వారా ఫోన్/మొబైల్ స్క్రీన్ పై 5 అంకెను నొక్కి సోలార్ విద్యుత్ పిర్యాదులను నమోదు చేయవచ్చని తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నిర్దిష్ట సమయంలోగా సంబంధిత సోలార్ పరికరాల విక్రేత సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సమస్యను పరిష్కరించిన వెంటనే వినియోగదారునికి ఫీడ్ బ్యాక్ కాల్ చేయబడుతుందని, వినియోగదారుడు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా పిర్యాదును మూసివేయడం/తెరవబడడం జరుగుతుందన్నారు. సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు.

