హాస్టల్ విద్యార్థులకు 2022 మెనూ అమలు చేయాలి
1 min read– పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలి
పల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె : పట్టణంలో MRO రామకృష్ణ గారికి వినతిపత్రం అందజేస్తున్న AISF బనగానపల్లె నియోజకవర్గ కార్యదర్శి యన్.పవన్ కళ్యాణ్ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ బనగానపల్లె నియోజకవర్గ కార్యదర్శి యన్.పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో 2018 మెనూ రద్దుచేసి పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా 2022 మెనూనుతక్షణమేఅమలుచేయాలని,ప్రస్తుతం 3 నుండి 5 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 1200,6వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 1250, ఇంటర్ ఆపై స్థాయి విద్యార్థులకు 1400 డైట్ చార్జీలు ఉండగా పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా 3 వ తరగతి నుండి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2500,ఇంటర్,ఆ పై స్థాయి విద్యార్థులకు 3000 డైట్ చార్జీలను పెంచాలని,హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం సప్లై చేయాలని,వసతి గృహాలలో ఖాళీగా ఉన్నటువంటి కుక్, కమాటీ,వాచ్మెన్ల పోస్టులను, వార్డెన్ల పోస్టులను భర్తీ చేయాలని,నాడు నేడు కింద వసతి గృహాలు అన్నింటిని కూడా అభివృద్ధి చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతేకాకుండా 2018 మెనూ అమలవుతున్న నేపథ్యంలో 2018 లో ఉన్నటువంటి మెనూ ధరలకు ప్రస్తుతం 2022 సంవత్సరానికి ఉన్నటువంటి మెనూ ప్రకారం నిత్యవసర ధరలకు చాలా వ్యత్యాసం ఉందని అప్పుడు ఉన్నటువంటి రేట్ల కంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు చూసుకుంటే చాలా ఎక్కువగా రేట్లు ఉన్నాయని,ఏమి కొనేటట్టు, ఏమి తినేతట్టు ఉన్నాయని ఈ క్రమంలో వార్డెన్లు 2018 మెనూ ప్రకారం వస్తున్న బిల్లులకు విద్యార్థులకు సక్రమంగా భోజనం పెట్టడానికి చాలా ఇబ్బందులు.ఎదుర్కొంటున్నారని,2018 మెనూ అమలు అవుతున్నప్పటికీ విద్యార్థులకు అందించేటువంటి భోజనం నాణ్యత విషయంలో ఎటువంటి మార్పులు లేవని,విద్యార్థులకు పెట్టె భోజనం విషయంలో నాణ్యత ఏమాత్రం ప్రభుత్వం తగ్గలేదని ఆ నాణ్యతకు తగినట్టుగా విద్యార్థులకువార్డెన్లు భోజనాలు పెట్టాలంటే 2022 మెనూ తక్షణమే అమలు చేసి,పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్,కాస్మొటిక్ పెంచాలని,ఆ వైపున రాష్ట్రం ప్రభుత్వంచర్యలు తీసుకోవాలి ఏఐఎస్ఏఫ్గాడిమాండ్చేస్తున్నాంఈకార్యక్రమంలోనాయకులు అజాయ్, ఉపేరేంద్ర,మహేష్, తదితరులు పాల్గొన్నారు,