21 రోజుల అంతర్జాతీయ యోగ డే 2026 ఉత్సవాలు
1 min read
-డాక్టర్ మాకాల సత్యనారాయణ
విజయవాడ, న్యూస్ నేడు: నగరంలోని యోగ శక్తి సాధన సమితి ఆధ్వర్యంలో జూన్ నెల ఒకటవ తారీఖు నుండి 21వ తేదీ వరకు 21 రోజులు ఇంటర్నేషనల్ యోగ డే 20 26 ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మా కాల సత్యనారాయణ తెలిపారు. అశోక్ నగర్ లోని ఇండియన్ హోం కేంద్ర కార్యాలయము నందు ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన ద్వారా జరుగుతుందని తరువాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చేయబోయే కార్యక్రమాలను అందించినట్లు తెలిపారు.ఈ సంవత్సరం ‘యోగ ప్రాణమయ కోశ మరియు ఫిట్నెస్ మంత్ర ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ’ పేరు మీద ఉంటుందని, దానికిగాను అవగాహన సదస్సులు, ఆరోగ్య శిబిరాలు,శిక్షణ, పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పరంభోత్సవం తరువాత నొప్పులకు చికిత్స శిభిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.విజయవాడ, పిఠాపురం,గుడివాడ,రేపల్లె, ఉయ్యూరు,బాపట్ల, విశాఖపట్నం వగైరా ప్రాంతాలలో చేపడుతున్న కార్యక్రమాలలో పాల్గొనవారు సమాచారం కొరకు సెల్ నెంబర్ 9000 347 369 కు సంప్రదించాలని కోరారు.

