ఆ బడిలో 215 అస్థిపంజరాలు..!
1 min readపల్లెవెలుగు వెబ్: కెనడాలో దారుణం వెలుగు చూసింది. కామ్ లూప్స్ ఇండియన్ రెసిడెన్సియల్ స్కూల్ ప్రాంగణంలో 215 మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడ్డాయి. వీరిలో కొందరు మూడేళ్ల చిన్నారుల అస్థిపంజరాలు కూడ ఉన్నాయి. ఒక రాడార్ ద్వార లభ్యమైన సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకప్పడు దేశంలోనే అతిపెద్ద విద్యాసంస్థ. అనేక కుటుంబాలు తమ పిల్లల్ని ఇక్కడ చదివించేవారు. ఈ స్కూల్ లో దారుణాలు జరిగాయంటూ ఐదేళ్ల క్రితం ఒక నిజనిర్ధారణ కమిటీ నివేదిక వెలువరించింది. సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల 3200 మంది దాక పిల్లలు చనిపోయి ఉంటారని నివేదిక పేర్కొంది.