2,200 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్ల మరమ్మతులు: మంత్రి శంకర్ నారాయణ
1 min readపల్లెవెలుగు వెబ్, మహానంది: రాష్ట్రంలో 2,200 కోట్ల రూపాయలతో దెబ్బతిన్న ఆర్.ఎం.పి రోడ్ల మరమ్మతులతో పాటు కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. దైవ దర్శనార్థమై మహానంది కి వచ్చిన ఆయన మాట్లాడుతూ ఇప్పటికే దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. టెండర్లు పూర్తి అయిన తర్వాత పనులు చేపట్టని కాంట్రాక్టర్ లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి వద్ద ఉన్న బుగ్గ నుంచి కడప కర్నూలు ప్రకాశం జిల్లాల సరిహద్దు నుంచి గుంటూరు వరకు నాలుగు లైన్ల రహదారి లో నేషనల్ హైవే త్వరలో నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు .వీటికి సంబంధించి ఇప్పటికే ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మహానంది మండలంలో ఎంసి ఫారం వద్ద ఉన్న పాలేరు వాగుపై వంతెన నిర్మాణం తో పాటు మహానంది ,గాజులపల్లె మరియు మహానంది బుక్కాపురం నంద్యాల రహదారులు కూడా త్వరలో మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు .ఇందుకు సంబంధించి మహానంది దేవస్థానం ఈవో గంజి మల్లికార్జున ప్రసాద్ ఆర్ అండ్ బి మంత్రి కి వినతిపత్రాన్ని అందజేసి రోడ్ల మరమ్మతులతో పాటు వెదర్ నేపాల్ వాగుపై బ్రిడ్జి నిర్మించాలని వినతి పత్రాన్ని అందజేశారు .ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆర్ అండ్ బిడీఈ తదితరులు పాల్గొన్నారు.