25మంది మృతి: ఆక్సిజన్ కొరత
1 min read
Close-up of medical oxygen flow meter shows low oxygen or an nearly empty tank
పల్లెవెలుగు వెబ్: ఢిల్లీలో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. చాలా ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వెంటనే అధికారులు ఆక్సిజన్ ట్యాంకులను సరఫరా చేశారు. కొంత ఊపిరి పీల్చుకున్నట్టయింది. ఆక్సిజన్ త్వరగా అందకపోయి ఉంటే 60 మంది రోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారేది. ప్రసుత్తం మిగిలిన ఆస్పత్రులకు కూడ ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో ఢిల్లీలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీరనుంది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 25 మంది మరణించారు. 510 మంది కోవిడ్ రోగులు చికిత్సకోసం రాగా.. 132 మందికి ఆక్సిజన్ అసరమైందని వైద్యులు తెలిపారు. కోవిడ్ పేషంట్లకు ఆక్సిజన్ అవసరం ఎక్కువ అవుతుండటంతో ఆక్సిజన్ కొరత నెలకొంది.