PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

254 ఎకరాలు కొట్టేసినట్లు.. నిర్ధారణ

1 min read
విలేకరులతో మాట్లాడుతున్న జేసీ గౌతమి

విలేకరులతో మాట్లాడుతున్న జేసీ గౌతమి

– రిటైర్డు తహసీల్దార్​పై క్రిమినల్​ కేసు నమోదు చేస్తాం..
–కడప జాయింట్​కలెక్టర్​ గౌతమి
పల్లెవెలుగు వెబ్​, కడప: కడప జిల్లాలో వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ రిటైర్డు తహసీల్దార్​ ప్రవేట్​ వ్యక్తులకు ధారాదత్తం చేశాడు. ఈ వ్యవహారంపై సీసీఎల్‌ఏ(భూపరిపాలన ప్రధాన కమిషనర్‌) కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. మైలవరం మండల తహసీల్దారు ఉద్యోగ విరమణకు కొన్నిరోజుల ముందు నిబంధనలకు విరుద్ధంగా జిరాయితీ పట్టాలు మంజూరు చేశాడు. రెవెన్యూరికార్డుల్లో మార్పిడిపై… ఓ పత్రికలో వచ్చిన వార్తక సీసీఎల్‌ఏ స్పందించి.. సమగ్ర నివేదిక ఇవ్వాలని కడప జిల్లా సంయుక్త పాలనాధికారిని ఆదేశించారు. కొట్టే వెంకట శివరామయ్య తహసీల్దారుగా పనిచేసినప్పుడు 254 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి అక్రమంగా రెవెన్యూ రికార్డుల్లో మార్పిడులు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ అంశంపై కడప జిల్లా సంయుక్త పాలనాధికారి(జేసీ) గౌతమి సోమవారం విలేకరులతో మాట్లాడారు. కె.వి.శివరామయ్య తహసీల్దారుగా ఉద్యోగవిరమణ చేసేముందు మైలవరం మండల రెవెన్యూ రికార్డుల్లో జిరాయితీ పట్టాల మార్పులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసిన జేసీ గౌతమి.. ఈ వ్యవహారంలో తహసీల్దారు, అక్కడ పనిచేసే కంప్యూటర్‌ ఆపరేటర్‌ కీలకమని పేర్కొన్నారు.

About Author