NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెండో రోజు 27 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు

1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: టి. నరసాపురం మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రెండో రోజు మొత్తం 27 నామినేషన్లు దాఖలైనట్లు మండల ఎన్నికల అధికారి టి. గోవింద రాజు తెలిపారు. గురువారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి రెండో రోజు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. పార్టీల వారీగా

నామినేషన్ల వివరాలు

 తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 9- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -10- జనసేన పార్టీ 7- భారతీయ జనతా పార్టీ (బీజేపీ) – 1మొత్తంగా రెండో రోజు 27 నామినేషన్లు దాఖలైనట్లు మండల ఎన్నికల అధికారి టి. గోవింద రాజు వెల్లడించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *