300 ఏళ్ల నాటి గుడి కూల్చివేత !
1 min readపల్లెవెలుగువెబ్ : రాజస్తాన్లో 300 ఏళ్ల నాటి గుడిని కూల్చారు. అల్వాజ్ జిల్లాల సరై మొహల్ల గ్రామంలో 300 ఏళ్ల క్రితం నాటి ఒక గుడిని బుల్డోజర్తో కూల్చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై సరై మొహల్ల నగర పంచాయతీ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్, అల్వార్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, స్థానిక ఎమ్మెల్యే రాజ్ఘర్లపై పోలీసు కేసు నమోదు అయింది. బరాజస్తాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గుడిని కూల్చేస్తున్న వీడియోను భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘‘కరౌలీ, జహంగిర్పురిలో జరిగిన దానికి కన్నీళ్లు పెట్టుకున్న వారే ఇప్పుడు హిందువుల నమ్మకాన్ని దెబ్బ తీశారు. ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్న సెక్యూలరిజం’’ అని విమర్శలు గుప్పించారు.