ఆ రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు !
1 min readపల్లెవెలుగువెబ్ : మహిళా రిజర్వేషన్ల పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రిపుర రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించబోతున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. త్రిపురలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాజధాని అగర్తలాలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాను మళ్లీ త్రిపురకు వస్తానని చెప్పిన అమిత్ షా.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను విప్లవ్ దేవ్ ప్రభుత్వం నెరవేరుస్తోందని అన్నారు. తాను మళ్లీ త్రిపురకు వస్తానని, ఓట్లు అడుగుతానని పేర్కొన్నారు.