ఆంధ్ర హాస్పిటల్స్ లో35వ ఉచిత పిల్లల గుండె సర్జరీలు
1 min read

విజయవాడ, న్యూస్ నేడు: ఆంధ్ర హాస్పిటల్స్ లో హీలింగ్ లిటిల్ ఆర్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో 35వ ఉచిత పిల్లల గుండె సర్జరీలు క్యాంపు జూలై 28 నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు జరిగిందని, ఆంధ్ర హాస్పిటల్ చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పి.వి .రామారావు తెలియజేశారు. స్థానిక సూర్యారావుపేటఆంధ్ర హాస్పిటల్ హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పటల్లో శనివారం జరిగిన లేఖల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఇన్ని పిల్లల గుండె ఆపరేషన్లు విజయవంతంగా చేయడానికి ఆంధ్ర హాస్పిటల్స్ డాక్టర్ విక్రమ్ ఆధ్వర్యంలో పీడియాట్రిక్ కార్డియాలజీ టీం నవజాత శిశువుల మరియు పీడియాట్రిక్ ఇంటెన్సీ కేర్ టీం కలిసి పని చేయడం వలన సాధ్యపడిందని ఆయన అన్నారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ బి.ఆర్ జగన్నాథ్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ శ్రీ మధుసూదన్ సాయి హాస్పిటల్ ముద్దినహల్లి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి హార్ట్ అండ్ బ్రెయిన్ ఆంధ్ర హాస్పిటల్స్ డాక్టర్ నాగేశ్వరరావు కార్డియాక్ సర్జన్ తో కలిసి ఆంధ్ర హాస్పిటల్స్ లో 11 పిల్లల గుండె ఆపరేషన్లు నిర్వహించారని ఆయన అన్నారు. అత్యంత క్లిష్టమైన గుండె జబ్బులు మరియు ఇతరకిష్టమైన గుండాపరేషన్లు క్యాంపు నిర్వహించామని తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ బి.ఆర్ జగన్నాథ్ మాట్లాడుతూ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో ఉచిత పిల్లల గుండె సర్జరీలు గత పది సంవత్సరాల నుండి ఇప్పటివరకు 35 సార్లు ఆంధ్ర హాస్పిటల్స్ పిల్లలకు గుండె సర్జరీలు విజయవంతంగా చేశారని మున్ముందు కూడా ఈ రకమైన గుండె ఆపరేషన్లు వ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పిల్లల నెలకు 50 నుంచి 60 ఆపరేషన్లు చొప్పున సంవత్సరానికి 600 పిల్లల గుండె ఆపరేషన్లు చేస్తున్నామని ఇప్పటివరకు 4000 ఆపరేషన్ పైన విజయవంతంగా నిర్వహించారని ఆయన అన్నారు. ప్రముఖ చిన్నపిల్లల కార్డియాలజిస్ట్ లు, డాక్టర్ నాగేశ్వరరావు ,డాక్టర్ రమేష్ డాక్టర్ రఘురాం ,తిరుపతిరావు , గుండెఆపరేషన్ లు జరిగిన పిల్లలు వారుతల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

