వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీగా బాలరాజు సత్యరాజు
1 min read

చెన్నూరు ,న్యూస్ నేడు : వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ జిల్లాకు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలలో నియమించడం జరిగింది. ఇందులో సోషల్ మీడియా రాష్ట్ర సెక్రటరీగా చెన్నూరు కి చెందిన బాలరాజు సత్యరాజును నియమించడం జరిగింది. పార్టీకి తమ వంతు కృషి చేసిన వారిని గుర్తించి వారికి వివిధ విభాగాలలో పెద్ద పీఠ వేయడం జరిగింది. ఇందులో సోషల్ మీడియా యాక్టివిటీ లో సత్య రాజు తన స్థాయికి మించి పార్టీ కొరకు కష్టపడడం జరిగింది. దీనిని గుర్తించిన పార్టీ అదినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్య రాజుకు పార్టీలో తగిన స్థానం కల్పించడంతో చెన్నూరు మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఎప్పటికీ సముచిత స్థానం ఉంటుందని ఆయన నియామకం ద్వారా అందరికీ తెలిసింది. బాధ్యతాయుతంగా పార్టీ కోసం పని చేసే ఎవరికైనా పార్టీ పదవులతో పాటు మంచి గుర్తింపును కూడా ఇవ్వడం జరుగుతుందని పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు చర్చించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా రాష్ట్ర సెక్రటరీగా నియమితులైన బాలరాజు సత్యరాజు చెన్నూరులో శనివారం విలేకరులతో మాట్లాడుతూ, మా నాయకులు వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తను నన్ను నమ్మి తనకు ఇంతటి గౌరవప్రదమైన పదవి ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనములు తెలపడంతో పాటు, తనను నియమించిన పదవికి న్యాయం చేస్తానని అహర్నిశలు పార్టీ అభివృద్ధి కొరకు తన వంతు అంకిత దీక్షతో కృషి చేస్తానని ఆయన తెలిపారు. అలాగే నా నియామం కొరకు దోహదపడిన కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి, కమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ పోచం రెడ్డి నరేన్ రామాంజుల రెడ్డికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

