4వ విడత “వైయస్ఆర్ ఆసరా” సంబరాలు
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 2, 3, 4, 5, 6, 7, 24,25 వార్డుల పరిధిలో సోమవారం మెప్మా ఆధ్వర్యంలో కె.వి.ఆర్ గార్డెన్స్ నందు 4వ విడత “వైయస్ఆర్ ఆసరా” సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి , కౌన్సిలర్ లు బోయ జయమ్మ, లాలు ప్రసాద్, వార్డు ఇంచార్జ్ లు ఆర్ట్ శ్రీను, సన అబ్దుల్లా, బోయ శేఖర్, మార్కెట్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేకూర్చారని అన్నారు. విద్యా మరియు వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.ప్రతి పేద విద్యార్థి కి కూడా కార్పోరేట్ స్ధాయిలో విద్యను అందిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న పరిస్థితులను జగనన్న ప్రభుత్వంలో చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని గమనించాలని అన్నారు. మీ కుటుంబంలో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండని చెప్పిన దమ్మున్న ఏకైక నాయకుడు జగనన్న అని కొనియాడారు. అనంతరం కార్యక్రమంలో కేక్ కట్ చేసి సీయం జగన్ చిత్రపటానికి పొదుపు మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా టి.యం.సి శాంత కుమారి, సి.ఓ అర్చన, వినయ్, అర్పీలు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.