50 కోట్ల మంది పేదరికంలోకి.. సమయం లేదు !
1 min readపల్లెవెలుగు వెబ్: పేదరికం పెరగడం, ఆదాయాలు తగ్గడం, ప్రభుత్వాలు కఠినమైన ఆర్థిక పరిమితులు ఎదుర్కొంటున్నందున.. ఆర్థిక కష్టాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు హెచ్చరించాయి. కరోన కారణంగా వైద్య సేవల ఖర్చులు సొంతంగా పెట్టాల్సి రావడంతో 50 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోయే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నాయి. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ విషయంలో రెండు దశాబ్దాలుగా ప్రపంచం సాధించిన ప్రగతిని కోవిడ్ మహమ్మారి దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరించాయి. ఇక సమయం లేదని, ప్రపంచ దేశాలు స్పందించాలని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.