NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

26న.. ఓర్వకల్లులో యోగాంద్రను విజయవంతం చేయండి..

1 min read

పథకాల సంతృప్తికరంపై లబ్ధిదారులకు ఫోన్ కాల్స్..

అధికారులతో మండల ప్రత్యేక అధికారి సమీక్ష..

ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్​ నేడు  : 26వ తేదీ రేపు సోమవారం ఉ 7 గంటలకు ఓర్వకల్లులో రాక్ గార్డెన్ దగ్గర ఏర్పాటు చేసిన యోగాంద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కర్నూలు జిల్లా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ మండల ప్రత్యేక అధికారి రమణయ్య అధికారులకు సూచించారు.శనివారం మ 3 గంటలకు నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాసులు అధ్యక్షతన వివిధ మండల అధికారులతో సమావేశం జరిగింది.ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మాట్లాడుతూ 11 అంతర్జాతీయ వారోత్సవాలు ఈనెల 21 నుండి వచ్చేనెల జూన్ 21 వరకు వారోత్సవాలు జరుగుతాయని అన్నారు. అధికారులందరూ తమ శాఖ సిబ్బందిని సమన్వయం చేసుకొని స్వయం సహాయక సంఘ సభ్యులు, రైతులు,విద్యార్థులు,యువతీ యువకులు,అంగన్వాడీ,సచివాలయ సిబ్బంది అందరినీ మోటివేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.అదేవిధంగా ప్రభుత్వం నుండి లబ్ధిదారులకు అందుతున్న పథకాల గురించి వారి అభిప్రాయం సంతృప్తికరంగా ఉందా లేదా అనే వాటిపై లబ్ధిదారులకు ఫోన్ కాల్స్ వస్తాయని అధికారులందరూ జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులతో పీడీ అన్నారు.వివిధ రకాల సర్వేల యందు గల ప్రగతిని మెరుగుపరచుటకు అవసరమైన కార్యచరణ ప్రణాళికను పంచాయతీ కార్యదర్శులకు సచివాలయ సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

About Author