NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హలో బీసీ చలో ప్రొద్దుటూరు…

1 min read

వై నాగేశ్వరరావు యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు డీసీ ఎంఎస్ చైర్మన్

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూల్ లో వై.ఎన్. ఆర్ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు ,  రాష్ట్ర బీసీ కార్యదర్శి మద్దిలేటి , గొర్రెల సంగం అధ్యక్షులు కే.ఏ.శ్రీనివాస్  పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా  వై.నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ 26 /5/2025 తేదీన బీసీల సమస్యల పై జరుగు సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య  హాజరు కావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అలాగే బీసీల సమస్యల పై ప్రతి ఒక్కరూ చర్చించాలని తెలియజేశారు. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ బీసీల కులగనన చేపట్టబోతున్నందుకు, బీసీల కొరకు 47 కోట్ల బడ్జెట్ కేటాయించినందుకు గాను, 24 శాతం నుండి 34% వరకు స్థానిక సంస్థల ఎన్నికలలో అవకాశం కల్పించినందుకు, ప్రతి జిల్లాలో బీసీ భవనాల నిర్మాణాన్ని చేపట్టినందుకు, బీసీలకు 50% శాతం  కల్పించినందుకు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు  తెలియజేశారు.

 బీసీల యొక్క చిరకాల డిమాండ్స్:-1.చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి 2.బీసీలకు అన్ని రంగాలలో సమచేసే స్థానం కల్పించాలి.3. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, ప్రకారం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలి 4. మహిళా బిల్లులో బీసీ మహిళలకు ప్రత్యేక  సబ్ క్వాటా ఇవ్వాలి. 5. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. పై సమస్యల పై చర్చించి పోరాడేందుకు  బీసీ సమావేశానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలని తెలియజేశారు.

About Author