ముగిసిన 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ శాఖ గ్రంధాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిసాయి. గ్రంథాలయ అధికారి రాంకుమార్ అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమానికి గ్రామపంచాయతీ గౌరవ సలహాదారు ఎక్స్ ఎంపీపీ ఎస్ నాగరత్నం మండల విద్యాధికారి మస్తాన్వలి అరసం కార్యదర్శి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తల్లిదండ్రులు వారి పిల్లలను చిన్ననాటి నుండే గ్రంథాలయాలకు పరిచయం చేయాలని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అన్ని పుస్తకాలు కొనలేరని గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు, గ్రంధాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వక్తలు అయినా శ్రీ మహబూబ్ సాహెబ్, బి చిన్నారెడ్డి, మాణిక్యరావు, మహబూబ్ బాషా,t సవ్వప్ప ఈరన్న, రవికుమార్ గ్రంథాలపై విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం 56వ జాతీయ గ్రంథాల వారోత్సవాల్లో వివిధ పోటీల్లో విజేతరైనవారికి మొమెంటులు, ప్రశంసా పత్రాలను ప్రముఖులచే ప్రధానం చేయించారు.