59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభం
1 min read
నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహణ
వెలుగోడు, న్యూస్ నేడు: స్థానిక శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ వేడుకలు మరియు భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడ మైనది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) బ్రహ్మం నాయక్ గారు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థులు, యువత, పాఠకులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. పుస్తక పఠనం ద్వారా జ్ఞానం, ఆలోచనా శక్తి, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయని తెలిపారు.అనంతరం పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పిల్లల పట్ల నెహ్రూకు ఉన్న ప్రేమ, దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి శ్రీమతి ఎన్.వి. సుమలత జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత, పాఠకులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రంథాలయ సేవలను వినియోగించుకోవాలని కోరడమైనది.



