PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదోనిలో 6, 518 ఇళ్లు నిర్మించాల్సిందే..

1 min read

– జాయింట్​ కలెక్టర్​ (హౌసింగ్​) ఎన్​.ఆర్​. మౌర్య
– రూరల్​, అర్బన్​ స్థలాల లే అవుట్లను పరిశీలన
పల్లెవెలుగు వెబ్​, ఆదోని: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు – పేదలందరికీ ఇల్లులో భాగంగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా ను విజయవంతం చేయాలని రెవెన్యూ, హౌసింగ్​ అధికారులను ఆదేశించారు జిల్లా జాయింట్​ కలెక్టర్​ (హౌసింగ్​) నారపు రెడ్డి మౌర్య. బుధవారం ఆదోని రూరల్​, అర్బన్​ ప్రాంతాల్లో జగనన్న కాలనీలకు కేటాయించిన ఇంటి స్థలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ యన్. ఆర్ మౌర్య మాట్లాడుతూ ఆదోని మండలంలో 2,788, అర్బన్​లో 3, 725 ఇంటి స్థలాలు కేటాయించారని, విడతల వారీగా వందశాతం గ్రౌండింగ్​ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదోని డివిజన్​ రెవెన్యూ, హౌసింగ్​ అధికారులను ఆదేశించారు.

గృహ నిర్మాణాలకు సంబంధించి ఇసుక, ఇటుకలు, సిమెంటు సరఫరా తదితర గృహ నిర్మాణానికి సంబంధించి సామాగ్రి పై దృష్టిసారించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) యన్. ఆర్ మౌర్య ఆదేశించారు. జూలై ఒకటవ తేదీ పింఛను పంపిణీకి ఇబ్బంది లేకుండా ఉదయం 9 గంటల లోపు పూర్తి చేసి హౌసింగ్ మేళా కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) యన్. ఆర్ మౌర్య ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్.డి.ఓ రామకృష్ణారెడ్డి, హౌసింగ్ పి.డి వెంకటనారాయణ, ఈ. ఈ గురు ప్రసాద్, డి. ఈ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆర్జివి కృష్ణ, తాసిల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో గీత వాణి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేరు విజయ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

About Author