నంద్యాల ఎంపీ చోరవతో 6 ప్రత్యేక శబమరిమలై ఎక్స్‌ప్రెస్ రైళ్లు
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల: శ్రీ పోచా బ్రహ్మానంద రెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యు లు ప్రెస్‌తో మాట్లాడుతు శబరిమలైకి వెళ్లాలనుకునే అయ్యప్ప స్వామి భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఆయన తన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ప్రయత్నిస్తున్నను అని చెప్పారు. గతేడాది కూడా ఆయన అభ్యర్థన మేరకు అయ్యప్ప స్వామి భక్తుల కోసం 4 రైళ్లను శబరిమలైకి నడిపారు.ఈ రైలును జిల్లలోని భక్తులందరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు.ఇందుకు కృషి చేసిన నంద్యాల రైల్వే సభ్యుడు ఎన్ ఎం డీ జుబైర్ బాషాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచ బ్రహ్మనాదరెడ్డి విన్నపంతో శబరిమలై వెళ్ళు అయ్యప్ప భక్తుల సౌకర్యార్ధం, నంద్యాల రైల్వేస్టేషన్ మీదుగా, విజయవాడ-కొట్టాయం-విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్ళను దక్షిణ మధ్య రైల్వే నడపనున్నది.రైలు నంబర్ 07139 విజయవాడ-కొట్టాయం ప్రత్యేక రైలు, డిసెంబర్ 15, డిసెంబర్ 22, జనవరి 5 తేదీలలో (శుక్రవారం), విజయవాడ నుండి సాయంత్రం 04:25 గంటలకు బయలుదేరి, నంద్యాల రైల్వేస్టేషన్ కు రాత్రి 11:10 గంటలకు చేరుతుంది. నంద్యాల రైల్వేస్టేషన్ నుండి రాత్రి 11:15 గంటలకు బయలుదేరి, కొట్టాయం కు మరుసటి రోజు రాత్రి 10 గంటలకు చేరుతుంది.రైలు నంబర్ 07140 కొట్టాయం-విజయవాడ ప్రత్యేక రైలు, డిసెంబర్ 17, డిసెంబర్ 24, జనవరి 57 తేదీలలో (ఆదివారం), కొట్టాయం నుండి అర్ధరాత్రి 01:00 గంటకు బయలుదేరి, నంద్యాల రైల్వేస్టేషన్ కు రాత్రి 08:30 గంటలకు చేరుతుంది. నంద్యాల రైల్వేస్టేషన్ నుండి రాత్రి 08:35 గంటలకు బయలుదేరి, విజయవాడ కు మరుసటి రోజు ఉదయం 06:15 గంటలకు చేరుతుంది. ఈ రైలు మార్గమధ్యంలో గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, కంభం, గిద్దలూరు, బనగానపల్లె, కోయిలకుంట్ల, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పాలక్కడ్, త్రిసూర్, అలువ, ఎర్నాకులం టౌన్ రైల్వేస్టేషన్లలో ఆగనున్నది.01 ఏసి ఫస్ట్ క్లాస్-కం-ఏసి టూ టైర్, 2 ఏసి టూటైర్, 2 ఏసి త్రీటైర్, 10 స్లీపర్, 4 జనరల్, 2 బ్రేక్ వ్యాన్ లతో సహా, మొత్తం 21 బోగీలతో ఈ రైలు నడవనున్నది.