PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 66 వ ఆవిర్భావ దినోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాలం: APUWJ యూనియన్ కౌతాళం మండల అధ్యక్షులు విజయ్ కుమార్, కౌతాళం మండల కేంద్రం లో ఈ కార్యక్రమం నిర్వా హించగా  వెలుగు ఆఫీస్ నందు నిర్వహించిన 66 వ ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి స్థానిక హాస్పిటల్ నందు రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు  మరియు గౌరవ అధ్యక్షులు  మాట్లాడుతూ యూనియన్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు అనేక సమస్యలపై పోరాటాలు చేశామని పాత్రికేయులకు ఏ సమస్య వచ్చిన సరే నేనున్నానంటూ మనకు హామీ ఇచ్చే ఏకైక యూనియన్ ఏపీయుడబ్ల్యూజే యూనియన్ అని అదేవిధంగా యూనియన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా సరే మండల కమిటీకి తెలుపాలని వారికి అండగా ఉంటామని అన్నారు. మన యూనియన్ ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని యూనియన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు యూనియన్ స్థాపించి ఇన్ని సంవత్సరాలైనా సరే ఈరోజు వరకు కూడా కొనసాగుతూ ఉందంటే అది ఏపీయూడబ్ల్యూజే  యూనియన్ మాత్రమే నాని రాష్ట్రంలో జిల్లాలో ఎన్నో యూనియన్లు ఉన్నా సరే పాత్రికేయులకు మండలాల నుండి జిల్లాల వరకు రాష్ట్రం వరకు పోరాటం చేసే ఏకైక యూనియన్ మన యూనియన్ మాత్రమేనని ఎన్నో యూనియన్లు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఇప్పటివరకు కూడా కొనసాగుతూ ఉందంటే అది మన యూనియన్ మాత్రమేనని మరియు ఇంత గొప్ప యూనియన్ లో మనం కూడా సభ్యులుగా ఉన్నందుకు గర్వపడాలని తెలియజేస్తున్నాముఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ మండల గౌరవ అధ్యక్షులు మహమ్మద్  మండల అధ్యక్షులు విజయ్,ప్రధాన కార్యదర్శి వలి భాష,తాలూకు ఉపాధ్యక్షులు మంజునాథ్, మండల ఉపాధ్యక్షులు అంజి మరియు నరేష్, మండల సహాయ కార్యదర్శి ,శివకుమార్,శరణ బసవ కోశాధికారి ముక్తార్ భాష,తాలూకా కార్యవర్గ సభ్యులు ముదుకప్ప,రాజు సభ్యులు అనిల్ కుమార్,రమేష్, హుస్సేని, హనుమేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.

About Author