మార్చి 6న అంతర్రాష్ట్ర స్థాయి ఎద్దులు బండలాగుడు పోటీలు
1 min read– కొణిదేలలో భారీ ఎత్తున బండలాగుడు పోటీలు.
– పెద్దబండ పందెం మొదటి బహుమతి రూ.70 వేలు.
– మహానంది లో పెద్దబండ నందు గెలుపొందిన ఎద్దులకు అనుమతి లేదు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలో వెలసిన శ్రీ మత్కోణిదేల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి తిరుణాల ఉత్సవాలను పురస్కరించుకుని మార్చి 6న సోమవారం పారువేట సందర్భంగా ఉదయం 7 గంటలకు రైతు సంఘం ఆధ్వర్యంలో ఎద్దులు పెద్దబండ లాగుడు పోటీలు నిర్వహిస్తున్నామని గ్రామ సర్పంచి కొంగర నవీన్, ఆలయ ధర్మకర్త కిరణ్ కుమార్, గ్రామ రైతు సంఘం నాయకులు తెలిపారు. పోటీలలో గెలుపొందిన వృషబాలకు మొదటి బహుమతి రూ.70 వేలు, రెండవ బహుమతి రూ. 50,000, మూడవ బహుమతి రూ. 30,000, నాలుగో బహుమతి రూ. 20,000, ఐదవ బహుమతి రూ. 10,000, ఆరవ బహుమతి రూ.5,000 అందజేయడం జరుగుతుందన్నారు. పోటీలలో పాల్గొనదల్చినవారు సోమవారం ఉదయం ఏడు గంటల లోపు ఎంట్రీ ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ఈ ఏడాది మహానంది లో పెద్దబండ పోటీలలో గెలుపొందిన ఎద్దులకు అనుమతి లేదని తెలిపారు.ప్రతి ఒక్కరు స్వామి వారి సేవలో పాల్గొని తిరుణాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతు సంఘం నాయకులు, దేవాలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.