719 మంది వైద్యులు మృతి ..!
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన రెండో దశ దేశాన్ని వణికించింది. సామాన్య ప్రజలతో పాటు కరోన బాధితులకు చికిత్స అందించిన అనేక మంది వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా 719 మంది వైద్యులు మృతి చెందారు. బీహార్ రాష్ట్రంలో గరిష్టంగా 111 మంది డాక్టర్లు మృతి చెందగా… ఢిల్లీలో 109 మంది మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లో 79 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. వెస్ట్ బెంగాల్‌లో 63 మంది వైద్యులు, రాజస్థాన్‌లో 43 మంది వైద్యులు, తెలంగాణలో 36 మంది వైద్యులు, ఏపీలో 35 మంది వైద్యులు, గుజరాత్‌లో 37 మంది డాక్టర్లు మృతి చెందినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది.