75 వేల మంది కి ఉద్యోగ అవకాశాలు
1 min readపల్లె వెలుగు వెబ్ ఢిల్లీ: దీపావళికి రెండు రోజుల ముందు అంటే శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యువతతో ప్రధాని సమావేశం కానున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లోని ఉద్యోగాలకు ఎంపికైన 75 వేల మంది యువతకు నియామక పత్రాలను అందజేస్తారని పేర్కొన్నాయి. రక్షణ, రైల్వే , పోస్టల్, హోం , కార్మిక మరియు ఉపాధి శాఖలతో పాటు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సీబీఐ, కస్టమ్స్, బ్యాంకింగ్ సహా పలు విభాగాల్లో ఎంపికైన వారికి పోస్టింగ్ ఇవ్వనున్నారు.శనివారం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సైతం పాల్గొంటారు. ఒడిశా నుంచి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, గుజరాత్ నుంచి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, చండీగఢ్ నుంచి కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, మహారాష్ట్ర నుంచి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, రాజస్థాన్ నుంచి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్,తమిళనాడు నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉత్తర్ ప్రదేశ్ నుంచి భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర పాండే, ఝార్ఖండ్ నుంచి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా, బిహార్ నుంచి కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రి గిరిరాజ్ సింగ్ పాల్గొంటారు.