NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు .. సాంస్కృతిక ఉత్సవాలు

1 min read

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్

అమరావతి, న్యూస్​ నేడు:  7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవములు 2025 @ అనంతపురము జిల్లాఈ రోజు రాష్ట్రంలో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు అనగా గ్రామ రెవెన్యూ సహాయకులు (VRA) నుండి డిప్యూటీ కలెక్టర్ల స్థాయి వరకు తీవ్రమైన పని ఒత్తిడికి గురి అవ్వడం అందరికి తెలిసిందే. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు అన్నింటిలోనూ రెవెన్యూ శాఖను భాగస్వామిగా చేయడం ఒక రెవెన్యూ ఉద్యోగిగా ప్రతి ఒక్కరికీ సంతోషంగా వున్నప్పటికీ ఉద్యోగుల సంఖ్య తగ్గి బాధ్యతలు పెరగడంతో పనిభారంతో రెవెన్యూ ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతున్న మాట నిజం.రెవెన్యూ ఉద్యోగులపై ఉన్న తీవ్ర పని ఒత్తిడిని అధిగమించడానికి క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఒక భాగమని గ్రహించి, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (APRSA)- 2005 వ సంవత్సరములో మొదటి రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు హైదరాబాదు నుండు అత్యంత ప్రతిష్టాత్మకమైన గచ్చిబౌలి క్రీడా ప్రాంగణంలోను, రెండవ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు ఉక్కు నగరమైన విశాఖ జిల్లా స్టీల్ ప్లాంట్ లోనూ, మూడవ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు చిత్తూరు జిల్లాలోనూ, నాల్గవ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు తిరిగి విశాఖ జిల్లా స్టీల్ ప్లాంట్ లోనూ, ఐదవ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు కాకినాడలోనూ, అరవ రాష్ట్రస్థాయి క్రీడలు -2022 లో గుంటూరు లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అలనాటి భూ పరిపాలన ప్రధాన కమీషనర్లు, జిల్లా కలెక్టర్లు, అనేక మంది పెద్దలు మరియు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర మరియు ఆయా జిల్లాల సంఘ నాయకులు మరియు ప్రతి రెవెన్యూ ఉద్యోగి సహకారంతో విజయవంతంగా రెవెన్యూ వారికి సాటిరారెవ్వరు అన్న రీతితో రాష్ట్ర స్థాయి క్రీడలు జరుపుకోవడం జరిగిందఅని సహృదయముతో ధైర్యంగా ముందుకు వచ్చిన ఉమ్మడి అనంతపురము జిల్లా అధ్యక్షులు శ్రీ ఆర్.యన్. దివాకరరావు, జిల్లా కార్యదర్శి & రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ జి. సోమశేకర్, మరియు ఉమ్మడి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు శ్రీ కె. మధు నాయక్, కార్యదర్శి శ్రీ హెచ్. డి.యం. మైనుద్దీన్ కి మరియు తమ కర్తవ్యంగా చొరవ.

About Author