NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహాయోగి లక్ష్మమ్మ అవ్వ దేవాలయ ఘనంగా ప్రారంభోత్సవం

1 min read

చిన్నహ్యాట్‌లో భక్తి శ్రద్ధల మధ్య ఈబీజీ గోవింద్ గౌడ్ పాల్గొన్నారు

టీడీపీ నేతల సమక్షంలో ఆలయ ప్రారంభోత్సవం

ప్రత్యేక పూజలు నిర్వహించిన గోవింద్ గౌడ్

గ్రామ ప్రజల నుంచి ఘన సన్మానం

హోళగుందన్యూస్ నేడు: చిన్నహ్యాట్ గ్రామంలో  ఆదోని మహాయోగి లక్ష్మమ్మ అవ్వ దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం  భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి టిడిపి మండల ప్రధాన కార్యదర్శి శ్రీ ఈబీజీ గోవింద్ గౌడ్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు యారిస్వామి , సింధువలం మల్లి , మలయ్య  పాల్గొని కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేశారు.ఆలయ ప్రారంభోత్సవం అనంతరం గోవింద్ గౌడ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజల ఆరోగ్యం, ఆనందం మరియు శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. గ్రామ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఇలాంటి దేవాలయాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఈబీజీ గోవింద్ గౌడ్ ని పూలహారాలతో ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చిన్నహ్యాట్ మాజీ ఎంపీటీసీ తాయన యరప్ప , గ్రామ పెద్దలు, టిడిపి నాయకులు మరియు అనేక మంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author