హక్కుల పరిరక్షణ కొరకు మేడే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు..
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ: హక్కుల పరిరక్షణ కొరకు మేడే స్ఫూర్తితో ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ పేర్కొన్నారు.140 వ మేడే ను పురస్కరించుకుని సిఐటియు ఆధ్వర్యంలో దేవనకొండ మండల కేంద్రంలో జరిగిన మే డే ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో మూడు చోట్ల అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు స్థానిక సీఐటీయూ కార్యాలయం దగ్గర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ బస్టాండ్ నందు సిఐటియు మండల ఉపాధ్యక్షురాలు జ్యోతిలక్ష్మి ఆటో స్టాండ్ నందు సిఐటియు సీనియర్ నాయకులు నాగేష్ ఎర్రజెండాలను ఎగురవేశారు . దేవనకొండ మండల కేంద్రంలో శుక్రవారం నాడు 140వ మేడే వేడుకలు సిఐటియు మండల కార్యదర్శి అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వీర శేఖర్ మాట్లాడుతూ 140 ఏళ్ల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో ఎనిమిది గంటల పని విధానం పనికి తగ్గ వేతనం తమ హక్కుల కొరకు జరిగిన కార్మిక పోరాటంలో కార్మికుల బలి దానాలతో హక్కులు కల్పించబడ్డాయని ప్రస్తుతం హక్కులను రక్షించుకోవడానికి మరొక పోరాటానికి కార్మిక వర్గం ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. నేటి పాలకుల అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక నిరంకుశ విధానాలు కార్మిక వర్గాన్ని అణచివేసే ధోరణి కనపడుతుందని పేర్కొన్నారు ,నాటి బ్రిటిష్ వలస పాలకులు కార్మిక తిరుగుబాటుకు తలొగ్గి హక్కులు కట్టబెడితే నేటి స్వతంత్ర భారతావనిలో పెట్టుబడులు,అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు ఊడిగం చేసే విధానాలతో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను నేటి పాలకులు కాలరాయడం అత్యంత దుర్మార్గం అన్నారు. పాలకుల కార్పొరేట్ అవినీతి రాజకీయాలతో దేశంలో నానాటికి కార్మికుల హక్కులు తీసికట్టు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు .

