NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రుణాలు సక్రమంగా చెల్లించిన లబ్దిదారులకు సన్మానం

1 min read

కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.ముక్కంటి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు రుణాలు తీసుకున్న లబ్ధిదారులతో రుణాలను సక్రమంగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ని అందించడంతోపాటు,వారిని సన్మానించినట్లు ఎస్పీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. ముక్కంటి చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో రుణాలు సక్రమంగా చెల్లించిన లబ్దిదారులకు రుణ విముక్తి  పత్రాలను అందించడంతోపాటు, దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ముక్కంటి మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులముల సేవా సహకార సంఘం లి.ఏలూరు వారి ద్వారా 2015-16 నుండి 2018-19 వరకు NSFDC / NSKFDC పధకముల క్రింద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నందు లబ్ది పొందిన లబ్దిదారులకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి జి.ఓ.ఆర్.టి.నెం. 319, తేది.31-12-2025 ఉత్తర్వుల మేరకు, ఈ కార్యాలయమునకు బకాయి పడిన లబ్దిదారులు వారు చెల్లించవలసిన ఋణ బకాయి నందు అసలు (ప్రిన్సిపల్) సొమ్ము మొత్తమును ది.30-04-2026 లోపుగా చెల్లించిన  వారికి వడ్డీ మాఫీ చేయడం జరుగుతుందన్నారు. ఆదేశములు జారీచేయడమైనది.   జిల్లాలో రూ.13.55 కోట్లు బకాయిలు వుండగా ది.01-01-2026 నుండి ది.28-04-2026 వరకు రూ.1.59 కోట్ల అసలు సొమ్ము 61 మంది లబ్దిదారుల నుండి వసూలు చేశామన్నారు. . ది.25-04-2026 నుండి 27-08-2026 నాలుగు (4) రోజుల వ్యవధిలో 12 మంది బకాయిదారులు వారు చెల్లించవలసిన అసలు ఋణమును యస్.సి కార్పోరేషన్, ఏలూరునకు చెల్లించిన వారికి యస్.సి కార్పోరేషన్, ఏలూరు కార్యాలయము నందు సన్మానించుట జరిగినదన్నారు.  రుణగ్రహీతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని  ఈనెల 30వ తేదీలోగా రుణాలు చెల్లించి వడ్డీ రాయితీ ని పొందాలని కోరారు.

About Author