NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా పరిషత్ సీనియర్ అసిస్టెంట్ ఇ.వి హరికృష్ణ పదవీ విరమణ 

1 min read

హరికృష్ణ తమ సేవా కాలమంతా క్రమశిక్షణ,నిజాయితీ,అంకితభావంతో పనిచేశారు

ఉమ్మడి జిల్లా చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్

శుభాకాంక్షలు తెలిపిన అధికారులు,తోటి సిబ్బంది, బంధుమిత్రులు స్నేహితులు

జిల్లా పరిషత్ కార్యాలయం

ఏలూరు, న్యూస్​ నేడు : జిల్లా పరిషత్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించిన ఇ.వి హరికృష్ణ  పదవీ విరమణ పొందిన సందర్భంగా ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ హరికృష్ణ  తమ సేవా కాలమంతా క్రమశిక్షణ, నిజాయితీ,అంకితభావంతో సుమారు 40 సంవత్సరాల పాటు పనిచేసి జిల్లా పరిషత్‌కు మంచి పేరు తీసుకువచ్చారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, జూనియర్ సిబ్బందికి మార్గనిర్దేశనం చేసిన ఆయన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ జిల్లా పరిషత్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.హరికృష్ణ భవిష్యత్తు జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా సాగాలని చైర్‌పర్సన్  ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో మరియు అధికారులు,సిబ్బంది, బంధుమిత్రులు స్నేహితులు పాల్గొని దంపతుల ఇరువురికి  శాలువాలు కప్పి,పూల బొక్కేలు అందించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *