వేసవి విజ్ఞాన శిబిరం
1 min read
కథాంశం విద్యార్థులచే చదివించి అవగాహన కల్పించారు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు శాఖా గ్రంధాలయం నందు ఉచిత వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా శనివారం విద్యార్థిని విద్యార్థులకు ఎమ్.సోమశేఖరా చార్యులు రచించిన తల్లి ప్రేమ పుస్తకంలోని సరైన తీర్పు అనే కథను విద్యార్థులచే చదివించడం,పుస్తక సమీక్ష చేయించడం జరిగినది. అనంతరం రీసోర్స్ పర్సన్ అట్లూరి సతీష్ లెక్కలు-కొలతలు- తూనికలు గురించి విపులంగా విద్యార్థిని విద్యార్థులకు అర్థమయ్యే రీతిగా తెలియపరచి,బాల బాలికలను కొన్ని ప్రశ్నలు అడుగుట జరిగినది. తరువాత ఇండోర్ గేమ్స్ లో భాగంగా క్యారమ్స్ ఆట నేర్పించి ఆడించుట జరిగినది. ఈ కార్యక్రమమునకు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నరు, ఈ కార్యక్రమం గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించుట జరిగినది.పాల్గొనిన విద్యార్థిని విద్యార్థులకు స్నాక్స్ పంచిపెట్టడం జరిగినదని తెలియజెసినారు.


