NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలే కూటమి ప్రభుత్వ లక్ష్యం

1 min read

కొక్కెరపాడు-2లో రూ.15 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు మండలం కొక్కెరపాడు పేదలకు,గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటి ముంగిటే నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు స్పష్టం చేశారు. మంగళవారం పెదపాడు మండలం కొక్కెరపాడు-2 గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ మరియు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ అందుబాటులోకి రావడం ద్వారా చిన్నపాటి అనారోగ్య సమస్యలకు గ్రామంలోనే చికిత్స పొందే అవకాశం కలుగుతుందని, తద్వారా ప్రజలకు సమయం మరియు ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు.నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, రాబోయే నాలుగు నెలల కాలంలోనే ఈ హెల్త్ క్లినిక్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మరియు కాంట్రాక్టర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే పరమావధిగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు,  ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందిస్తూ కూడా ప్రజలకు అండగా నిలుస్తూ సుపరిపాలనలో అడుగులు వేస్తున్నామని, ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గారపాటి రామసీత, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొప్పన సుధా, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రాంప్రసాద్, క్లస్టర్ ఇంచార్జ్ గుత్తా అనిల్, జిల్లా కమిటీ సభ్యురాలు, గుడిపూడి రేవతి, మండల తహసిల్దార్ కృష్ణ జ్యోతి, ఎంపీడీవో అమీలుజామ, వట్లూరు సొసైటీ చైర్మన్ కొమ్మన లక్ష్మణ్ మోహన్ (బుడ్డియ్య ), చంటి బాబు,మండల పార్టీ అధ్యక్షులు మరడాని రవి, సెక్రటరీ వేగుంట సురేష్ బాబు, క్లస్టర్ ఇంచార్జ్ ముళ్ళపూడి సాంబశివరావు, సహా పలువురు కూటమి నాయకులు మండల పార్టీల అధ్యక్షులు,క్లస్టర్ ఇన్చార్జిలు,సొసైటీల చైర్మన్లు , వైద్య ఆరోగ్య శాఖ సహా వివిధ శాఖల అధికారులు,సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author