మదనపల్లెలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవం
1 min read
జాతీయ జెండానుఆవిష్క రించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమా నికి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తోందని వెల్లడి
మదనపల్లె ఆగస్టు 15, న్యూస్ నేడు ప్రతినిధి : మదనపల్లె బిటీ కళాశాల మైదానం లో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ట్రాన్స్పోర్ట్, క్రీడా మరియు యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిజాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఇన్చార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి,సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డిఆర్ఓ వెంకటేశు లు హాజరయ్యారు. ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లపై ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి, ఇన్చార్జి కలెక్టర్, ఎస్పీ, అధికారుల తో కలిసి సందర్శిం చారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా రూ.66.64 లక్షల విలువైన ఆస్తులను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆధ్వర్యం లో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు, దివ్యాంగులు, మహిళలు, యువతతో పాటు అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరవేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొ న్నారు. రైతుల ఉత్పాద కత పెంపు, వ్యవసాయ యాంత్రీ కరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎఫ్పిఓల బలో పేతంతో రైతులకు మరింత ఆదాయం చేకూరే లా చర్యలు తీసు కుంటున్నా మని వివరించారు. అలాగే మదనపల్లె పట్టణానికి చెందిన 3 ఏళ్ల చిన్నారి అనంత దక్షిత్ మదనపల్లె నుంచి కదిరి వరకు స్కేటింగ్ ద్వారా 79 కిలోమీటర్లు ప్రయాణం చేసి రికార్డు సాధించ డాన్ని అభినందిస్తూ మంత్రి చేతుల మీదుగా జ్ఞాపికను అందజేశారు. అదే విదంగా ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల కు మంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అంద జేశారు. ఈ వేడుకలలో భాగంగా ఇంచార్జి జిల్లా కలెక్టరు శివ్ నారాయణ శర్మ, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి లతో కలిసి స్వతంత్ర భారతావని కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులు లేట్ సి. శ్రీనివాస రావు, జె.సిద్ధప్ప నాయుడు, ఎం. పాపన్న గుప్తా, డివి నారాయణ శెట్టి కుమారులు సి. సీతారామయ్య, జె. భవాని ప్రసాద్, ఎంపీ మోహన గుప్తా, డివి భాస్కర్ శెట్టి లను మంత్రి ఘనంగా సత్క రించారు. జిల్లా అభివృద్ధిని ప్రతి బింబించేలా వివిధ ప్రభుత్వ శాఖలు ప్రగతి శకటాలను ప్రదర్శించడం జరిగింది. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు దేశ భక్తి సమైక్యతను,ఆంధ్రప్రదేశ్ చారిత్రాత్మక వైభవ ప్రాభవ సంస్కృతి సంప్రదాయాలు, మతసామరశ్యాన్ని నింపి అహుతులు, ప్రేక్షకులను ఆకట్టు కున్నాయి.



