కౌలు రైతులకు అవగాహన సదస్సు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కల్లూరు మండలం, పర్ల గ్రామంలో మంగళ వారం నాడు (05.05.2026 తేదీన) కౌలు రైతులతో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ కౌలుకు చేసుకునే రైతులు అందరూ కౌలు పత్రం తీసుకోవాలని, కౌలు పత్రం తీసుకోవడం ద్వారా కౌలు రైతులకు ఈ పంట నమోదు , ఇన్సూరెన్స్, పంట పరిహారం,పంట కొనుగోలు మొదలగు వంటి వాటికి ఉపయోగ పడుతుందని తెలియజేశారు. గ్రామంలో లోని రైతులతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో అంతర పంటలు సాగు చేసుకోవాలని, APAIMS 2.O యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి విష్ణు వర్ధన్ రెడ్డి , ఏఈఓ అహ్మద్ హుసేన్ , రెవిన్యూ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

