NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 ఆర్​యూ కర్నూలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మధ్య ఆవిష్కరణలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  రాయలసీమ విశ్వవిద్యాలయం, కర్నూలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మధ్య ఆవిష్కరణలు, ఇన్నోవేషన్ మొదలైన అంశాల విషయంలో ప్రోత్సహించేందుకు ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నట్లు వి.సి. ఆచార్య వి. వెంకట బసవరావు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, పరిశోధకులు మరియు ఔత్సాహిక యువ వ్యవస్థాపకులకు కొత్త అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.ఈ ఒప్పందంలో భాగంగా స్టార్టప్ ఇన్క్యూబేషన్, మెంటరింగ్ సపోర్ట్, ఇన్నోవేషన్ మరియు ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు, నైపుణ్యాభివృద్ధి మరియు సామర్థ్యవృద్ధి కార్యక్రమాలు ఉమ్మడిగా నిర్వహించబడతాయన్నారు. విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా మార్పిడి చేసుకునేందుకు అవసరమైన మార్గదర్శకత్వం, సాంకేతిక సహాయం మరియు పెట్టుబడి అవకాశాలపై అవగాహన పొందుతారని తెలిపారు.ఈ ఒప్పందం ద్వారా విద్యార్థి స్టార్టప్‌లకు ప్రత్యేక మద్దతు అందించడంతో పాటు, పరిశోధన ఫలితాల వాణిజ్యీకరణకు దోహదపడుతుందన్నారు. పరిశ్రమ-విద్యాసంస్థల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తూ, ఉపాధి అవకాశాలను పెంచడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం కూడా ముఖ్య లక్ష్యాలుగా ఉన్నాయి.ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయకుమార్ నాయుడు, ఇన్నొవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెల్ కోఆర్డినేటర్  డా. జి. రేణుక పాల్గొన్నారు. అనంతపురం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తరఫున  సీఈఓ డాక్టర్ హఫీజ్ భాషా, పరమేష్ నాయక్ తదితరులు హాజరయ్యారు.ఈ భాగస్వామ్యం కర్నూలు ప్రాంతాన్ని ఇన్నోవేషన్ మరియు స్టార్టప్‌ల కేంద్రంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించనుందని ఆచార్య బసవరాజు హర్షం వ్యక్తంచేశారు.

About Author