NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విజయవంతంగా “ఉచిత కంటి” ఆపరేషన్లు !

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్వ విద్యార్థులు మరియు యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరంలో విజయవంతంగా కంటి ఆపరేషన్లు జరిగాయని ఆసుపత్రి కోఆర్డినేటర్  తెలిపారు. మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరం యందు వైద్య పరీక్షల   అనంతరం ఆపరేషన్లు చేయించుకున్న వారికి సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. బెంగళూరు చిట్టెం హనుమాన్ ప్రసాద్, చెన్నై శంకర నేత్రాలయ ఆసుపత్రి సహకారంతో అత్యాధునిక పరికరాలతో కంటి వైద్య పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని,  ప్రతి ఒక్కరు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం  చెక్క గోపాల్(కిరాణం షాపు) కుటుంబం మరియు సముద్రాల నాగరాజు (పచ్చ బంకు) కుటుంబం ఆధ్వర్యంలో కంటి ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు అన్నదానం, బెంగళూరు వాసవి అన్నదాన ట్రస్ట్ నిర్వాహకులు సీతారామ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు.   ఉచిత కంటి వైద్య శిబిరంలో ఉదయం 22 మందికి ఆపరేషన్ లు మరియు దాదాపు 110 మందికి వైద్య పరీక్షలు చేశామని శంకర నేత్రాలయ ఆసుపత్రి కోఆర్డినేటర్స్ అరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో  కర్నూలు జిల్లా ఆర్. డబ్ల్యూ. ఎస్. అధికారి కృష్ణా నాయక్ మరియు పూర్వ విద్యార్థులు వీరేశప్ప, అడ్వకేట్ సురేష్ కుమార్, యువ స్పందన సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సురేంద్ర, లక్ష్మన్న, సెక్రటరీ నాగరాజు, సభ్యులు మధు, రమేష్, గిరి,  రాజేశ్వరి, వాలంటీర్లు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *