NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రీడలతో మానసిక ఆరోగ్యం – యువ నాయకుల పిలుపు

1 min read

అంగరంగ వైభవంగా ఈ. అనసూయమ్మ మెమోరియల్ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

రిబ్బన్ కట్ చేసి టోర్నమెంట్ ప్రారంభించిన రాజేంద్ర గౌడ్

విజేతలకు భారీ నగదు బహుమతులు – క్రీడాకారులకు ప్రోత్సాహం

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో దివంగత శ్రీమతి ఈ. అనసూయమ్మ జ్ఞాపకార్థం, ఈ.బి.జి గోవింద్ గౌడ్ & సన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ. అనసూయమ్మ మెమోరియల్ మెగా టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది.ఈ టోర్నమెంట్‌ను ఆమె తనయులు, టిడిపి యువ నాయకులు ఈ. రాజేంద్ర గౌడ్, భువనేష్ గౌడ్ మరియు ఇతర టిడిపి నాయకులు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేంద్ర గౌడ్ రిబ్బన్ కట్ చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించగా, మొదటి మ్యాచ్‌కు టాస్ వేసి పోటీలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా రాజేంద్ర గౌడ్ మాట్లాడుతూ, తన తల్లి అనసూయమ్మ జ్ఞాపకార్థంగా, తండ్రి టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఈ బిజీ. గోవింద్ గౌడ్ సహకారంతో క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ రాష్ట్రస్థాయి టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు గెలుపోటములను పక్కనబెట్టి క్రీడా స్ఫూర్తితో ఆడాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ పోటీలలో విజేతగా నిలిచిన జట్టుకు రూ.50,000 నగదు బహుమతి, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.30,000 నగదు బహుమతి ఈ. గోవింద్ గౌడ్ చేతుల మీదుగా అందజేయనున్నట్లు తెలిపారు.ఈ టోర్నమెంట్ నిర్వహణలో బాగోడి శ్రీనివాసులు, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మల్లికార్జున, హెచ్ మల్లయ్య, సిద్ధార్థ, మోయిన్, షాలి అమాన్, మహమ్మద్ గౌస్ తదితరులు ఆర్గనైజర్లుగా వ్యవహరిస్తున్నారు.ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు యువ నాయకుడు రాజేంద్ర గౌడ్‌ను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల హెచ్ఎం కబీర్ సాబ్, టిడిపి మాజీ మండల కన్వీనర్ వీరన్న గౌడ్, జనసేన మండల కన్వీనర్ అశోక్, టిడిపి మండల మైనార్టీ అధ్యక్షుడు ముల్ల మోయిన్, ఎస్ఎంసి చైర్మన్ ద్వారకానాథ్, యువ నాయకులు ల్యాబ్ గిరి, మండల తెలుగు యువత అధ్యక్షుడు బకాడి వీరేష్, సీనియర్ నాయకులు రామాంజిని, పంచగుండిగ వెంకటేష్, రారావి సిద్దు, మల్లయ్యతో పాటు పలువురు టిడిపి నాయకులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *