NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనాధ వృద్ధులు, వికలాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ

1 min read

స్వామి వివేకానంద ట్రస్ట్, భారత్ యూత్ అసోసియేషన్ సేవలు ప్రశంసనీయం

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలంలో స్వామి వివేకానంద ట్రస్ట్, ఆదోని మరియు భారత్ యూత్ అసోసియేషన్ హోళగుంద వారి ఆధ్వర్యంలో 52వ నెల సేవా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా అనాధ వృద్ధ మహిళలు, వికలాంగులు మరియు నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నిరుపేద కుటుంబమైన హోటల్ ఈరన్న, ఎర్రమ్మ దంపతులకు, మార్లమడికి గ్రామానికి చెందిన వృద్ధురాలు రాధమ్మకు, అలాగే గ్రామానికి సేవలందిస్తున్న గుర్కా నిరుపేద కుటుంబానికి అవసరమైన నిత్యవసర సరుకులను అందజేశారు.అలాగే అర్హులైన నిరుపేద వికలాంగులను గుర్తించి వారికి సేవా సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి నెల ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజంలో బాధితులకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు.ఈ సేవా కార్యక్రమం ప్రజల సహకారంతో కొనసాగుతుండటం ఆనందదాయకమని, భవిష్యత్తులో మరింత మందికి సేవలు అందించేందుకు కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో రవికాంత్, మల్లీ, శ్రీధర్ శెట్టి, తదితరులు పాల్గొన్నారు.

About Author