రైతులు వ్యవసాయ పనిముట్లు కొరకు దరఖాస్తు చేసుకోండి
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: రాయితీపై రైతులు వ్యవసాయ పనిముట్లు కొరకు దరఖాస్తు చేసుకోండని మండల వ్యవసాయ అధికారి రాజేష్ తెలిపారు.ఈసందర్భంగా ఆయన ఓ ప్రకటన ద్వారా తెలుపుతూ 06 మే 2026 ప్యాపిలి మండలం,డోన్ నియోజకవర్గం,నంద్యాల జిల్లా వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాల కోసం దరఖాస్తు చేసుకోవాలని బుధవారం మండల వ్యవసాయ అధికారి ఎ.రాజేష్ తెలిపారు.ఈనెల 5వ తేదీ నుండి 19వ తేదీ వరకు రైతులు seed.ap.gov.in/FM అను వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, బేలర్లు, తైవాన్ స్ప్రేయర్లు, ట్రాక్టర్ దుక్కు, దమ్ము సెట్లు, రోటోవేటర్లు, పవర్ వీడర్లు, పవర్ టిల్లరు తదితర వ్యవసాయ పనిముట్లు రాయితీతో రైతులకు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. చిన్న సన్నకారు రైతులు, మహిళా రైతులు, ఎస్సీ ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీతో మరియు ఇతర రైతులకు40 శాతం సబ్సిడీతో ఎస్ఎంఏఎం పథకం కింద వ్యవసాయ యాంత్రీ కరణ అందించనున్నట్లు చెప్పారు. వ్యవసాయ భూమి కలిగి లేదా ఆర్వోఆర్ భూమి కలిగిన రైతులు మాత్రమే అర్హులు, 2024-25 సంవత్సరానికి సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను పొందిన రైతు కుటుంబాలు అనర్హలు, దరఖాస్తు చేసుకున్న రైతులను లాటరీ పద్ధతి ద్వారా జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఎంపిక చేస్తారు. ఆసక్తిగల రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఏఓ కోరారు. మరింత సమాచారం కొరకు స్థానిక రైతు సేవ కేంద్రం సిబ్బందిని సంప్రదించవలసిందిగా మండల వ్యవసాయ అధికారి రాజేష్ తెలిపారు.

