NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలకు విద్యార్థులు ఎన్నిక

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని కొమ్మెమర్రి ఆదర్శ ప్రాథమిక పాఠశాల కి చెందిన 9 మంది విద్యార్థిని విద్యార్థులు గత నెల 12 వ తేదీన జరిగిన పరీక్షలకు హాజరై నేడు వెలువడిన ఫలితాల్లో దూదేకుల అంజుం షెహనాజ్ 100 కి 93 మార్కులు తెచ్చుకుని జిల్లాలో 9 వ ర్యాంక్ సాధించి డోన్ లో ఉన్న MJPAPBCWR స్కూల్ & కాలేజీ లో అదేవిధంగా దూదేకుల ఆరిఫ్ బాషా 100 కి 87 మార్కులు తెచ్చుకుని జిల్లాలో 40 వ ర్యాంక్ సాధించి బేతెంచర్ల లో గల MJPAPBCWR స్కూల్ & కాలేజీ లో సీటు సంపాదించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ రహీం ,ఉపాధ్యాయులుఋ పురుషోత్తం,అశ్విని హర్షం వ్యక్తం చేస్తూ పిల్లలకు శుభాకాంక్షలు తెలియచేశారు.గ్రామస్తులు మరియు మండల విద్యాధికారులు మహేశ్వర రెడ్డి,వెంకటేష్ నాయక్ లు పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.

About Author