గ్రామాల్లో చెరువులను పరిశీలించిన ఎంపీడీవో
1 min read
కుటుంబ వివరాలన్నీ సర్వేలో నమోదు చేయాలి
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాల్లో చెరువులను ఎంపీడీవో పి దశరథ రామయ్య పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలధారా-జల హారతి’కార్యక్రమంలో భాగంగా మండలంలోని చింతలపల్లి గ్రామంలో నారపల్లి చెరువు,కాజీపేటలో ఎంఐ ట్యాంకు,రోళ్లపాడులో రెడ్డిగారి కుంట,సుంకేసులలో ఎంఐ ట్యాంక్ లను మండల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేద నారాయణ,ఈసీ షబాన బుధవారం ఉదయం పరిశీలించారు.ఫీల్డ్ అసిస్టెంట్ కు,టెక్నికల్ అసిస్టెంట్ కు కూలీలకు తగు సూచనలు చేశారు.రాబోయే 100 రోజుల్లో అన్ని చెరువులు కుంటలు పూర్తిచేసి వర్షాకాలం నాటికి పూర్తిస్థాయిలో నీటిమట్టమును నింపి భూగర్భ జలాలను అభివృద్ధిపరిచే విధంగా చూడాలని ఎంపీడీవో వారికి సూచించారు.తర్వాత ఈనెల 30 వరకు జరుగుతున్న 2027 జనగణన సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ స్థితిగతుల వివరాలు ఈ సర్వేలో పూర్తిగా నమోదు చేయాలని ఎంపీడీవో మరియు మండల స్వర్ణ గ్రామ అధికారి సురేష్ కుమార్ వారికి సూచించారు.అలగ నూరులో జరుగుతున్న సర్వేను అధికారులు పరిశీలించారు.

