పెదపాడు శాఖా గ్రంధాలయంలో ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం
1 min read
అభయారణ్యంలో మృగాలు, వన్యమృగాలు,నేషనల్ పార్కులపై అక్కినేని శ్రీరామకృష్ణ
విశ్లేషణ
గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు శాఖా గ్రంధాలయం నందు ఉచిత వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా బుధవారం విద్యార్థిని, విద్యార్థులకు గ్రామ పెద్దలు అక్కినేని శ్రీరామకృష్ణ అభయారణ్యాలు గురించి చెప్పుచు మన భారతదేశంలో ఎన్నో రకాల వన్యమృగాలు ఉన్నాయి.తూర్పు ఆఫ్రికా, దక్షిణాఫ్రికా ఖండాల తర్వాత భారత ఉపఖండంలోనే యెన్నోరకాల వన్య మృగాలు ఉన్నాయి. మనదేశంలో 14 శాతం భూభాగంలో మాత్రమే అడవులు ఉన్నాయి.ఈ అడవులలోనూ,వీటిలో ప్రత్యేకంగా ఏర్పరిచిన అభయారణ్యాలలో,నేషనల్ పార్కులతో యీక్వర మృగాలు,వన్యమృగాలు పరిరక్షింప బడుతున్నాయి. అంతేకాక దేశపు పశ్చిమ ప్రాంతాన ఉన్న ఎడారులలో, ఈశాన్య భారతదేశపు కొండ ప్రాంతాలలో, కోస్తా ప్రాంతాలలో యెన్నోరకాల వన్య మృగాలు కనిపిస్తాయి. అండమాన్ నికోబార్, లక్షద్వీపాలలో కూడా సాగర జంతువుల పరిరక్షణ కేంద్రాల్ని, జలశయాల్ని ఏర్పరిచారు.అని విపులంగా అర్థమయ్యే రీతిగా తెలియపరచి,విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడుగుట జరిగినది.తదుపరి విద్యార్థిని విద్యార్థుల చేత తెలుగు పద్యాలు,వేమన శతక పద్యాలు చెప్పించడం జరిగినది. అనంతరం రిసోర్స్ పర్సన్ అట్లూరి సతీష్ పంతుల జోగారావు రచించిన చిట్టిబాబు చిట్టి కథలు అనే పుస్తకంలోని “చిన్నారి చిట్టెలుక సాహసాలు – మరుగుజ్జుల రాజ్యం” అనే కథలను విద్యార్థులచే చదివించడం,పుస్తక పఠనం చేయించడం జరిగినది. తర్వాత ఆటవిడుపుగా క్రికెట్ ఆటను నేర్పించడం, ఆడించడం జరిగినది.వినోదం కొరకు బాలికలచే వివిధ పాటలు పాడించడం కార్యక్రమం నిర్వహించడమైనది.ఈ కార్యక్రమములో గ్రంథాలయ సిబ్బంది,పాఠకులు,33 మంది విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొనినారు.ఈ కార్యక్రమం అంతయు గ్రంథాలయాధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించుట జరిగినది.పాల్గొనిన విద్యార్థిని,విద్యార్థులకు స్నాక్స్ పంచిపెట్టడం జరిగినదని తెలియజేశారు.

