సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ” సమాధాన్ సమరోహ్ – సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ ” సమాధాన్ సమరోహ్( దేశవ్యాప్తంగా మధ్యవర్తిత్వ తీర్పు మరియు వివాదాల సామరస్యం కోసం సుప్రీంకోర్టు చర్య) -2026 సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జి. కబర్థి బుధవారం తెలిపారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ఆగస్టు 21, 22, 23 తేదీల్లో సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసుల సెటిల్మెంట్ కొరకు జరుగుతుందని కక్షిదారులు తమ చెక్ బౌన్స్ కేసులు, ప్రమాదాలకు సంబంధించిన క్లైములు, భూ సేకరణ సమస్యలు, తదితర కేసులను ఈ ప్రత్యేక లోక్ అదాలత్ లో సెటిల్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉన్న కక్షి దారులు ఎవరైనా వారి కేసులను పరిష్కరించుకోవడానికి ఆన్లైన్లో గూగుల్ ఫారం(https://www.sci.gov.in) అందుబాటులో ఉంచామని తెలిపారు. ఫిర్యాదుదారులు మరియు కక్షి దారులు వారి అంగీకారంతో వారి న్యాయవాదులతో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, కర్నూలు వారు నిర్వహించే సెటిల్మెంట్ సమావేశాలకు ప్రత్యక్షంగా గాని వర్చువల్ గా గాని హాజరు కావచ్చు అని తెలిపారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 15100, 08518-248828కు ఫోన్ చేయాలని కోరారు.

