NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెదపాడు మండలం అంబేద్కర్ ఏరియాలో పల్లెనిద్ర

1 min read

జిల్లా ఎస్పీ ఆదేశాలతో నేర రహిత సమాజమే లక్ష్యం

పెదపాడు ఎస్ఐ ఆర్.శ్రీనివాస్

 ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: నేర రహిత సమాజమే లక్ష్యంలో భాగముగా పెదపాడు మండలం అంబేద్కర్ ఏరియాలో పోలీసుల పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ ఆధ్వర్యంలో పెదపాడు ఎస్ఐ ఆర్.శ్రీనివాస్ యొక్క సిబ్బందితో కలిసి పల్లె నిద్ర కార్యక్రమమును నిర్వహించి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించినారు.ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ వారు నూజి వీడు డిఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ యొక్క ఆదేశాలపై పెదపాడు అంబేద్కర్ ఏరియాలో  పల్లె నిద్ర కార్యక్రమము ను నిర్వహించారు.ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం,పోలీసు-ప్రజల మధ్య సమన్వయాన్ని పెంచడమే లక్ష్యంగా పెదపాడు ఎస్ఐ  ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్న శక్తి యాప్‌ లను గురించి చట్టపరమైన వెసులు బాటులు, ముఖ్యంగా పోక్సో  చట్టం గురించి ఎస్ఐ  వివరించారు.బాల్య వివాహాలు సామాజిక నేరమని, అటువంటి వాటిని అడ్డుకోవడంలో గ్రామస్తులు సహకరిం చాలని కోరారు.సైబర్ నేరాల పట్ల అప్రమత్తత ప్రస్తుత డిజిటల్ యుగంలో ఫోన్ కాల్స్, లింకుల ద్వారా జరుగుతున్న ఆర్థిక మోసాల  పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.దేశ ఆర్ధిక పునాది అయిన యువత డ్రగ్స్, గంజాయి మరియు మద్యం వంటి వ్యసనా లకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని,వాటి రవాణా లేదా వినియో గంపై సమాచారం అందించాలని పిలుపు నిచ్చారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిం చాలని, ద్విచక్ర వాహనంపై వెళ్లే టప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు.అసాంఘిక కార్యకలాపాల నిరోధం జూదం, పేకాట వంటి అసాంఘిక కార్య కలాపాలకు దూరంగా ఉండాలన్నారు.ఎవరైనా దాడులకు గాని దౌర్జన్యాలకు గాని పాల్పడితే వెంటనే డయల్ 112 కు లేదా ఇన్స్పెక్టర్ గారి వ్యక్తిగత ఫోన్ నెంబర్ 944079 6637 కు సమాచారం అందిం చాలని కోరారు. సమా చారం అందిం చిన వారి వివరాలను గోప్యంగా ఉంచు తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమములో  అంబేద్కర్ ఏరియా వాసులు ఉత్సాహంగా పాల్గొని చట్టపరమైన అంశాలపై తమ సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. పోలీసులకు, ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, పరస్పర నమ్మకాన్ని పెంపొందిం చేందుకు ఇటువంటి గ్రామ సభలు ఎంతో దోహదపడతాయని ఎస్ఐఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో పెదపాడు  పోలీస్ సిబ్బంది మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *