NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రేపు నందికొట్కూర్ వేళాంగణి మాత తిరుణాల

1 min read

రానున్న బిషప్ గోరంట్ల జ్వాన్నేష్..

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో వెలసిన వేళాంగణి మాత తిరుణాల మహోత్సవ వేడుకలు ప్రతి ఏడాది ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.అదే రీతిగానందికొట్కూరు పట్టణంలో (కర్నూలు రహదారి)మార్కెట్ యార్డ్ పక్కన ఆర్ సీఎం చర్చి ప్రాంగణంలో రేపు పదవ తేదీ ఆదివారం సా 6 గంటలకు జరిగే తిరుణాల మహోత్సవానికి ముఖ్యఅతిథిగా కర్నూలు ఆర్ సీఎం బిషప్ శ్రీ గోరంట్ల జ్వాన్నేష్ ముఖ్య అతిథిగా రానున్నట్లు రెక్టర్ మరియు విచారణ గురువులు ఫాదర్ బాలరాజు తెలిపారు.ఈ నెల 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు నవదిన ప్రార్థనలు..రేపు సాయంత్రం బిషప్ తండ్రి సమర్పించే దివ్యబలి పూజ,వాక్య పరిచర్య అనంతరం సంస్కృతిక కార్యక్రమాలు మేరీమాత చలనచిత్ర ప్రదర్శన ఉంటుందని రేపు ఆదివారం భక్తులు మ్రొక్కుబడులు చెల్లించుకునేందుకు తగిన వసతి కల్పించడం జరిగిందని ఫాదర్ బాలరాజు అన్నారు. ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని భక్తులు అనుకున్న తలంపులను వేలాంగణి మాత (మరియతల్లి)కి విన్నవిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని అన్నారు.

About Author