NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి మృతి పార్టీ కి తీరని లోటు

1 min read

మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పాలకుర్తి తిక్కారెడ్డి, పన్నగ వెంకటేష్ స్వామి

మంత్రాలయం న్యూస్ నేడు :  మండల పరిధిలోని మాధవరం గ్రామానికి చెందిన టిడిపి బిసి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి,యువ నాయకులు మాధవరం క్రిష్ణమోహను రెడ్డి సోదరుడు టిడిపి యువ నాయకులు శ్రీనివాస్ రెడ్డి అకస్మాత్తుగా మృతి టిడిపి పార్టీ కి తీరని లోటు అని కర్నూలు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, టిడిపి మండల కన్వీనర్ పన్నగ వెంకటేష్ స్వామి అన్నారు. శనివారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి ధైర్యంగా ఉండాలని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ  మంచి కార్యకర్తను కోల్పోవడం చాలా బాధాకరం వారి మృతి మాకు తీరని లోటు అని కుటుంబానికి అండగా ఉంటాం అన్నారు. అలాగే మండల పరిధిలోని టిడిపి నాయకులు కూడా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వీరి వెంట మాజీ జడ్పీటీసీ సభ్యులు రాజశేఖర్ రెడ్డి, యల్లారెడ్డి, వగరూరు అబ్దుల్, భరద్వాజ్ శెట్టి, వగరూరు టిడిపి నాయకులు,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *