మార్లమడికి గ్రామంలో ఘనంగా “బడి పిలుస్తుంది” నిర్వహణ
1 min read
హోళగుందన్యూస్ నేడు: మార్లమడికి గ్రామంలో “బడి పిలుస్తుంది” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గౌరవనీయులైన మండల విద్యాశాఖ అధికారి–2 శ్రీ కబీర్ సార్ ఆధ్వర్యంలో విజయవంతంగా సాగింది. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏ. పరమేష్ సార్, సి.ఆర్.పీ తుకారాం సార్, పాఠశాల ఎస్‌ఎంసి సభ్యులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి అక్కడ చదువుతున్న చిన్నారులను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం జరిగింది.ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్య వంటి సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.గ్రామంలోని ప్రతి చిన్నారి విద్యను అభ్యసించాలని, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామస్తులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ఎస్‌ఎంసి సభ్యులకు, కార్యక్రమానికి హాజరై ముందుండి నడిపించిన ఎఈఓ–2 శ్రీ కబీర్ సార్, సి.ఆర్.పీ తుకారాం సార్‌లకు మార్లమడికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.


