NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామి వారి నిత్య కైంకర్యలు

1 min read

నేడు12న హనుమద్ జయంతి మహా పర్వదినం సందర్భముగా  హనుమద్ హోమం (సామూహికంగా) జరుపబడును

భక్తులు ఈ కార్యక్రమం నందు పాల్గొని తీర్ధప్రసాదములు స్వీకరించవలసినదిగా మనవి

ఆలయ అసిస్టెంట్ కమీషనర్, కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన

ఏలూరు జిల్లాప్రతి నిధి,న్యూస్ నేడు: జంగారెడ్డిగూడెం మండలం,గురవాయిగూడెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఈ రోజు ఉదయం శ్రీ స్వామి వారి నిత్య కైంకర్యముల అనంతరం స్వామి వారికి లక్ష తమలపాకులతో లక్షార్చన (సామూహికంగా) జరుపబడినది అని ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలియజేసినారు. రేపు అనగా 12వ తేదీ మంగళవారం హనుమద్ జయంతి మహా పర్వదినం సందర్భముగా ఉదయం శ్రీ స్వామి దేవస్థానం నందు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు గావించినారు. అనంతరం హనుమద్ హోమం (సామూహికంగా) జరుపబడును. భక్తులు ఈ కార్యక్రమం నందు పాల్గొని తీర్ధప్రసాదములు స్వీకరించవలసినదిగా ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలియజేసినారు.

About Author